అమరావతి ఖర్చుపై వైసీపీ దుష్ప్రచారం.. రుషికొండ లెక్కలు గుర్తుచేసిన షరీఫ్

  • అమరావతి నిర్మాణ వ్యయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న ఎంఏ షరీఫ్
  • చదరపు అడుగుకు రూ.6,980 ఖర్చవుతుంటే, జగన్ రెట్టింపు చెబుతున్నారని ఆరోపణ
  • రుషికొండ ప్యాలెస్‌కు చదరపు అడుగుకు రూ.35,714 ఖర్చు చేశారని విమర్శ
  • అమరావతి నిర్మాణ పనుల వేగం చూసి ఓర్వలేకపోతున్నారన్న షరీఫ్
రాజధాని అమరావతి నిర్మాణ వ్యయంపై వైసీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ అహ్మద్ షరీఫ్ తీవ్రంగా విమర్శించారు. అమరావతిలో పనుల వేగాన్ని చూసి ఓర్వలేక, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్, ఆయన పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు.

 'అమరావతి నిర్మాణంలో చదరపు అడుగుకి రూ.6,980 మాత్రమే ఖర్చు అవుతుంటే.. వైఎస్ జగన్ రూ.12,000 నుంచి రూ.14,000 ఖర్చు అవుతుందని తప్పుడు లెక్కలు చెబుతున్నారు' అని షరీఫ్ స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.6,500 ఖర్చయిందని, దానితో పోలిస్తే అమరావతి నిర్మాణ వ్యయం సమంజసంగానే ఉందని వివరించారు.

ఈ సందర్భంగా రుషికొండ ప్యాలెస్ నిర్మాణ వ్యయాన్ని షరీఫ్ ప్రస్తావించారు. 'ప్రజాధనం రూ.700 కోట్లతో ఋషికొండపై తన సొంత నివాసం కోసం చదరపు అడుగుకి రూ.35,714 ఖర్చు చేసిన జగన్ రెడ్డికి, ప్రజా రాజధానిపై మాట్లాడే అర్హత లేదు,' అని ఆయన కుండబద్ధలు కొట్టారు. రాజధానిపై జగన్‌ అండ్‌ కో అబద్ధాలు ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
 
 

Mohammad Ahmad Sharif
Amaravati
YS Jagan Mohan Reddy
Rushikonda
Andhra Pradesh
TDP
Construction Cost
Political News
Telugu Desam Party
Real Estate

More Telugu News